ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్బంగా కర్నూలులో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. నగరంలోని వైఎస్సార్ విగ్రహానికి పూల మాలవేసి అనంతరం బాణాసంచా కాల్చి నగరవాసులకు మిఠాయిలు పంచి సంతోషాన్ని పంచుకున్నారు... ఈ సందర్బంగా ఇతర పార్టీల్లోని ప్రజాప్రతినిధులు వైకాపాలోకి రావాలంటే తమ పదవులకు రాజీనామా చేసి రావాలని ఆపార్టీ నాయకుడు సురేందర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షరతు విధించి ఉన్నతమైన రాజకీయ విలువలను పాటిస్తున్నారన్నారు.
ఇవీ చదవండి