కర్నూలు జిల్లా వెల్దుర్తి జాతీయ రహదారిపై జరగిన ప్రమాదానికి కారణమైన ఎస్.ఆర్.ఎస్ ట్రావెల్స్ బస్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని మంగళూరుకి చెందిన జోసెఫ్‌గా గుర్తించామని డీఎస్పీ ఖాదర్ భాషా తెలిపారు. ఈనెల 11న జరిగిన ఈ ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. అతివేగం, ప్రమాద సమయంలో బ్రేకులు పనిచేయకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. అతడిని కోర్టులో హాజరు పరుస్తామని వివరించారు.
ఇవీ చదవండి.. రాళ్లపల్లి మృతిపట్ల ప్రముఖుల సంతాపం