కర్నూలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్ ప్రభావం కనిపించింది. నగరంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఎన్జీవో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెదేపా, సీపీఎం నాయకులు బైక్ ర్యాలీ చేపట్టారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ కళ్లు తెరవాలని కోరారు. తెల్లవారుజాము నుంచే సీపీఐ నాయకులు ఆర్టీసీ బస్టాండ్ కు వచ్చి బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు.
