రాష్ట్రంలో ఇసుక సమస్యను తక్షణమే పరిష్కరించి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని కర్నూలులో సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. భవన నిర్మాణ సామగ్రితో పెద్ద సంఖ్యలో కార్మికులు నిరసన చేపట్టారు. కొంత కాలంగా ఇసుక దొరకని కారణంగా... తాము ఉపాధి కోల్పోయామని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని వారికి ఆర్డీవో హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి