కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అక్షిత్, అనన్యలు అన్నా చెల్లెలు. అక్షిత్ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అనన్య తొమ్మిదో తరగతి చదువుతోంది. వీరికి చిత్రాలేఖనంలో అభిరుచి ఉంది. ఈ క్రమంలో గత సెప్టెంబర్ నెలలో వినాయక చవితి సందర్భంగా అక్షిత్.. మైనంతో సూక్ష్మ గణపతి బొమ్మను తయారు చేశాడు.
8 నిమిషాల వ్యవధిలో..
ఫలితంగా 0.5 ఎంఎం సైజులో ఉన్న ఈ బొమ్మను ఎనిమిది నిమిషాల వ్యవధిలో గీశాడు. ఫలితంగా అక్షిత్ ప్రతిభకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కింది.
మైనంతో జాతీయ జెండా..
ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అనన్య.. మైనంతో జాతీయ పతాకాన్ని చేసింది. 0.5 ఎంఎం సైజులో అయిదు నిమిషాల వ్యవధిలో జాతీయ పతాకాన్ని తయారు చేసింది. ఫలితంగా వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. మెమెంటోలు, మెడల్స్, సర్టిఫికెట్లను అన్న చెల్లెకు అందించిన కొటేష్ ఆర్ట్స్ గ్యాలరీ నిర్వాకుడు కోటేష్.. అనంతరం వారిని అభినందించారు.
ఇవీ చూడండి : సెంటు భూమి పేరుతో 4 వేల కోట్లు దోచుకున్నారు: కాల్వ