కర్నూలు జిల్లా మహానంది మండలం బొల్లవరం గ్రామ వలంటీర్ శ్రీనివాసులును అధికారులు సస్పెండ్ చేశారు. వైకాపా వర్గానికి చెందిన ఓ మహిళ ఏడో వార్డుకి నామినేషన్ వేసేందుకు వలంటీర్ శ్రీనివాసులు వెళ్లాడు.
దీనిపై తెదేపా వర్గీయులు ఆరోపించడంతో అధికారులు వాలింటీర్ శ్రీనివాసులును తొలగించారు. గ్రామ వలంటీర్ల సహాయంతో ఎన్నికలను తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: సర్పంచి అభ్యర్థి కిడ్నాప్.. అధికార పార్టీ నేతలపై అనుమానం