కరోనా వ్యాప్తి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆళ్లగడ్డ శాసనసభ్యుడు గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. పురపాలక కమిషనర్ ఇతర అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే పట్టణ వీధుల్లో లాక్డౌన్ను పర్యవేక్షించారు. కరోనా వ్యాధి బాధితుల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 31 మంది కరోనా అనుమానితులు చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి.