తాను కేసులకు భయపడే రకం కాదని తెదేపా నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. 'భయపడి హైదరాబాద్ లో దాక్కున్నావ్' అని వైకాపా ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నంలో తన పాత్ర ఉందని గంగుల అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు. లాక్డౌన్ సమయంలో అహోబిలంలో గంగుల తన కుటుంబ సమేతంగా పూజలు చేయటం నిబంధనలను ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేశారు. ఈ విషయంపై హైకోర్టులో పిల్ వేస్తానని చెప్పారు.
ఇదీ చదవండి:
నిర్లక్ష్యమా.. యంత్రాంగ వైఫల్యమా.. వి'శోక' విపత్తుకు కారణాలేంటి..?