పంచాయతీ ఎన్నికల్లో తెదేపా బలపర్చిన అభ్యర్థులకు అండగా ఉండేందుకు ప్రయత్నిస్తుండగా తనపై దాడికి వైకాపా నాయకులు సిద్ధమయ్యారని మాజీమంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఆళ్లగడ్డ మండలం ఎస్.లింగందిన్నె గ్రామంలో తెదేపా బలపరిచిన అభ్యర్థి నామినేషన్ వేసేందుకు సిద్ధమవగా... వైకాపా నాయకులు అడ్డుకున్నారని చెప్పారు. విషయం తెలుసుకున్న తాను ఎస్.లింగందిన్నెకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. ప్రత్యర్థులు తన వాహనశ్రేణిపై కర్రలు, రాళ్లతో దాడులు చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లానని... ఎస్పీ స్పందించి గ్రామంలో పరిస్థితిని చక్కదిద్దారని వివరంచారు.
వైకాపా నాయకులు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని అఖిలప్రియ ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ లేకుండా చేసుకునేందుకు వైకాపా నేతలు అరాచకంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి...
'సర్పంచ్ అభ్యర్థిని కిడ్నాప్ చేస్తారా..ఏమిటీ ఆటవిక సంస్కృతి ?'