ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న 12 మందిని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు లక్షల 35 వేల రూపాయల నగదు, 8 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాలకు చెందిన ఓ వ్యక్తి... ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతకుంట గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద బెట్టింగ్ నిర్వహిస్తున్నాడన్న సమాచారంతో దాడులు నిర్వహించామని స్థానిక డీఎస్పీ పోతురాజు తెలిపారు.
ఇదీచదవండి.