ETV Bharat / state

'ఆగస్టు, సెప్టెంబర్​లో మరింత జాగ్రత్తగా ఉండాలి'

అసలే వర్షాకాలం... పైగా కరోనా విజృంభణ ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరు కరోనా పరీక్షలు చేసుకోవాలి? ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఏ స్థాయిలో ఉంది? వంటి విషయాలను కర్నూలు స్టేట్ కొవిడ్ సెంటర్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నరసింహులు ఈటీవీ భారత్​తో ముఖాముఖిలో వెల్లడించారు.

corona cases
corona cases
author img

By

Published : Aug 21, 2020, 3:46 PM IST

డాక్టర్ నరసింహులుతో ముఖాముఖి

వర్షాకాలంలో జ్వరం, జలుబు రావటం సహజమని... వచ్చిన వెంటనే ఆందోళన చెందవద్దని కర్నూలు స్టేట్ కొవిడ్ సెంటర్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నరసింహులు తెలిపారు. సాధారణ జ్వరం, జలుబు మూడు రోజుల తర్వాత తగ్గుముఖం పడుతుందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని... మరణాల రేటు సైతం పడిపోతోందని చెప్పారు. ఈటీవీ భారత్​తో ముఖాముఖిలో ఆయన మరిన్ని విషయాలు వెల్లడించారు.

ప్రశ్న : కరోనా కేసుల విషయంలో ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పరిస్థితి ఏలా ఉంది?
డాక్టర్ నరసింహులు: పరీక్షలు ఎక్కువగా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా పెరిగినట్లు ఉన్నా పరిస్థితి నిలకడగా ఉంది. సంతోషకరమైన విషయం ఏంటంటే మరణాల శాతం తగ్గుతోంది. ఇతర వ్యాధులు ఉన్నవారికి రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల కరోనా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. యువకులపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండదు. సాధారణ జలుబు మూడు రోజుల తరువాత ఎక్కువైతే కరోనా అనుకోవాల్సిందే. కరోనా వస్తే కొందరిలో ఒళ్లు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారికి కరోనా వస్తే ఎలాంటి లక్షణాలు కనిపించవు.

ప్రశ్న : మొదటి నుంచి రోగులను పరిశీలిస్తున్నారు. అప్పటికి.. ఇప్పటికి పరిస్థితిలో మార్పు ఉందా ?
జవాబు: మొదట్లో రోగిని తాకడానికే వైద్యులు భయపడ్డారు. ప్రస్తుతం సాధారణ రోగుల్లానే చూస్తున్నారు.

ప్రశ్న : మార్చి నెలలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఇప్పడు ఎలా ఉన్నాయి?
జవాబు: మొదట్లో పరీక్షల కోసం హైదరాబాద్‌, పుణేలకు పంపించే వాళ్లం. ఇప్పుడు జిల్లాలోనే పరీక్షలు చేస్తున్నాం. ప్రస్తుతం చికిత్స కోసం అవసరమైన వసతి, ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, మందులు అన్నీ ఉన్నాయి.

ప్రశ్న : వర్షాలు, చల్లగాలుల నేపథ్యంలో పాజిటివ్ కేసులు పెరిగే అవకాశముందా?
జవాబు: ఈ సీజన్‌లో కరోనా వైరస్​ కాకుండా నాలుగైదు వైరస్‌లు వస్తుంటాయి. మించిపోతే ఏ వైరస్‌ అయినా ప్రాణాంతకమే. వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి.

ప్రశ్న : ఎలాంటి వారు పరీక్షలు చేయించుకోవాలి?
జవాబు: కొవిడ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో సంచరించిన వారు... జ్వరం, తలనొప్పి లక్షణాలు ఎక్కువగా ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలి. డబ్బులు ఖర్చుపెట్టి కొంతమంది సీటీ స్కాన్‌ చేయించుకుంటున్నారు. అది రోగ నిర్ధారణ చేయదు.

ప్రశ్న: ఈ ట్రెండ్‌ను చూస్తూంటే ఎప్పుడు కరోనా ప్రభావం తగ్గుతుంది ?
జవాబు: ఒక మహమ్మారి తీవ్ర స్థాయికి చేరుకున్న తరువాత క్రమంగా తగ్గుముఖం పడుతుంది. అయితే ఆగస్టు, సెప్టెంబర్
నెలల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.