ETV Bharat / state

అరటి దిగుబడి ఆశాజనకం.. ధరే నిరాశజనకం - కర్నూలు మహానంది అరటి రైతులకు నష్టం వార్తలు

అరటి ధరలు రైతుకు తీరని నష్టం తెచ్చి పెట్టాయి. పెట్టుబడి వ్యయంలో యాభై శాతం కూడా రాకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. గిట్టుబాటు కాక ..ఆందోళన చెందాల్సిన దుస్థితి.

అరటి దిగుబడి ఆశాజనకం.. ధరే నిరాశజనకం
అరటి దిగుబడి ఆశాజనకం.. ధరే నిరాశజనకం
author img

By

Published : Oct 27, 2020, 10:35 AM IST

కర్నూలు జిల్లా మహానంది మండలం అరటిసాగుకు ప్రసిద్ధి. అరటిలో సుగంధ రకాన్ని సాగు చేయడం ఇక్కడ రైతులకు పరిపాటి. ఈ సారి దిగుబడి ఆశాజనకంగా ఉన్నా.. ధర మాత్రం నిరాశాజనకంగా ఉంది. ఒక గెల అరటి ధర యాభై రూపాయల నుంచి వంద దాకా ఉంది. ఈ ధర ఏమాత్రం గిట్టుబాటు కాదని రైతులు వాపోతున్నారు. ఎకరానికి కౌలు, పెట్టుబడి కలిపి లక్ష రూపాయలు ఖర్చు చేసినట్లుగా రైతులు చెబుతున్నారు.

అరటికాయలను కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని రైతులు తెలిపారు. చెట్టుపైనే కాయలు మాగి పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని అరటి రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

వచ్చే వారంలోనే అందుబాటులోకి ఆక్స్​ఫర్డ్​ టీకా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.