పర్యావరణానికి మట్టి వినాయకులే మేలు కర్నూలు జిల్లా డోన్ మండలం యూ. కొత్తపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రంగుల విగ్రహాల వలన పర్యావరణానకి జరగే హాని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు వరలక్ష్మి మాట్లాడుతూ మట్టి వినాయకులు పర్యావరణానికి మేలు చేస్తాయని విద్యార్థులకు చెప్పారు. మట్టి వినాయకులను వాడటం వలన కలిగే ఉపయోగాలు విద్యార్థులకు అర్థం అయ్యేటట్లు తెరపై ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి : కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతం