Auto workers protest: కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవ్ తేజ తీరుపై ఆటో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో 40 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆటో స్టాండ్లను తీసివేయాలని కమిషనర్ ఆదేశించడంతో.. ఆటో కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంలో కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కమిషనర్‌కు.. ఆటో కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఆటో స్టాండ్లను తొలగిస్తే తాము జీవనోపాధి కోల్పోతామని ఆటో డ్రైవర్లు వాపోయారు. ఆటో స్టాండ్లను యధావిధిగా కొనసాగించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: