ETV Bharat / state

బాణాల దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి సురక్షితం

కుటుంబ కలహాలతో అల్లుడు మామను విచక్షణారహితంగా బాణాలతో గాయపరిచాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం బైర్లూటిలో జరిగింది. తీవ్రంగా గాయపడిన గురవయ్యకు గుంటూరు జీజీహెచ్​ వైద్యులు మూడు గంటలపాటు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతం చేశారు.

బాణాల దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి  ప్రాణాలు సురక్షితం

author img

By

Published : Jun 8, 2020, 9:46 AM IST

భార్యపై వేధింపులు మానుకోవాలని మందలించాడనే కోపంతో మామపై అల్లుడు బాణంతో దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం బైరూట్లీ చెంచూగూడెంలో జరిగింది. బరమల బయ్యన్న తన కుమార్తె వీరమ్మను దోర్నాల మండలం కోర్రపోలూరుకు చెందిన ఉత్తలూరి చిన్నోడుకు ఇచ్చి వివాహం జరిపించారు. అల్లుడు మద్యానికి బానిసై వీరమ్మను తరచూ వేధిస్తుండటంతో బయ్యన్న కొద్ది రోజుల క్రితం కోర్రపోలూరు గ్రామానికి వెళ్లి అతడిని మందలించాడు. ఇది మనసులో పెట్టుకున్న చిన్నోడు మద్యం తాగి శనివారం రాత్రి 10 గంటల సమయంలో బైర్లూటి చెంచూగూడెం వచ్చి మామతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో వెంట తెచ్చుకున్న బాణాన్ని సంధించాడు. అది బయ్యన్న గుండె కింద భాగంలో దిగింది. కుటుంబ సభ్యులు అతడిని మెుదట ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తొలుత తరలించారు.

కర్నూలు వైద్యుల సూచనల మేరకు ఆదివారం గుంటూరు జీజీహెచ్​కు వృద్ధుడిని బంధువులు తీసుకువచ్చారు. సీనియర్ వైద్యులు అందుబాటులో లేకపోవటంతో సూమారు గంటసేపు స్ట్రేచర్​పైనే ఉంచారు. గాయపడిన తరువాత దాదాపు 19 గంటల పాటు బాధితుడు శరీరంలో బాణం అలాగే ఉంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు వైద్యులు బాణాన్ని కొంతమేర తొలగించారు. మిగిలిన భాగాన్ని డాక్టర్ కల్యాణి శస్త్రచికిత్స చేసి బయటికి తీశారు. ఇప్పుడు బయ్యన్నకు ప్రాణాపాయం లేదని చెప్పారు.

ఇవీ చదవండి

మామపై బాణాలతో అల్లుడు దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.