Teachers dharna at Kurnool Collector office front: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి, ప్రతినెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. ఉద్యోగస్తులు దాచుకున్న సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న దాఖలలు చరిత్రలోనే లేవని.. అలాంటిది వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఉద్యోగస్తులు దాచుకున్న సొమ్మును వాడుకున్నారని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు అన్నారు.
ఉద్యోగులు దాచుకున్న సొమ్మును వెంటనే జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి, ఒపీఎస్‌ను అమలు చేయాలని కోరారు. అదేవిధంగా ప్రతినెల ఒకటో తేదీన ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు వేయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుడు గాని ఉద్యోగి గాని దాచుకున్న సొమ్ము విషయంలో గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా తరలించే ప్రయత్నాలు చేయలేదు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి 13న సీఎస్ జవహర్ రెడ్డికి ఒక నోటీసు ఇచ్చాము. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఎటువంటి స్పందన లేదు.-హృదయరాజు, ఏపీటీఎఫ్, రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి