కర్నూలు జిల్లాలో కరోనా సమయంలో పాలనా సౌలభ్యం కోసం బదిలీలు చేసిన రెవెన్యూ సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. గతేడాది అక్టోబర్ నెలలో కలెక్టర్ వీరపాండియన్ 67 మంది రెవెన్యూ ఉద్యోగులను వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారని వారు తెలిపారు. నాటి నుంచి విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ... జీతాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జీతాలు ఇవ్వాలని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గిరికుమార్ రెడ్డి కోరారు.
ఇదీచదవండి.