మంగళవారం కర్నూలు జిల్లాలో కురిసిన వర్షానికి చెట్లు, విద్యుత్ స్థంబాలు నెలకొరిగాయి. కర్నూలు సమీపంలోని నూతన పల్లె, సుదిరెడ్డి పల్లె, పసుపుల, నందన పల్లె, భూపాల్ నగర్ గ్రామాల్లో విద్యుత్ స్థంబాలు పడిపోవడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. చెట్లు విరిగి ఇళ్ల పై పడడంతో పాటు పశువులకు వేసిన షెడ్డు సైతం భారీగా వీచిన గాలికి ఎగిరిపోయాయి.ధాన్యం తడవడంతో రైతులు తీవ్రంగా నష్ణపోయినట్లు తెలిపారు.
ఇవీ చదవండి