కర్నూలు లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలు స్ట్రాంగ్ రూంకు చేరుకున్నాయి. వీటిని కర్నూలు నగర శివారులోని పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచారు. కర్నూలు, ఆదోని, మంత్రాలయం, ఆలూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు, పత్తికొండ శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు ప్రత్యేక గదుల్లో అధికారులు భద్రపరిచారు. కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. నంద్యాల లోక్సభ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను రాయలసీయ విశ్వవిద్యాలయంలో భద్రపరిచారు.
ఇవీ చదవండి