శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఇస్రో ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇస్రో, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ప్రతినిధులు.. ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్య ప్రతినిధులతో కలసి విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. 5, 6 తేదీల్లో పాఠశాల కళాశాల విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇస్రో సంస్థ గ్రూప్ డైరెక్టర్ ఏ ప్రసాదరావు, ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తో పాటు పలువురు యాజమాన్య ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి