ETV Bharat / state

కప్పట్రాళ్ల స్టేజీలో రోడ్డు ప్రమాదం - devanakonda

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును బొలేరో వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడ్డవారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jul 10, 2019, 1:57 PM IST

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లా దేవనకొండ రహదారిలో కప్పట్రాళ్ల స్టేజీ వద్ద కర్ణాటకకు చెందిన బొలేరో వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 8మందికి గాయాలయ్యాయి. మృతుడు మాన్వికి చెందిన వినోద్‌గా గుర్తించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది చూడండి: WC19: టీమిండియా గెలుపు​ కోసం ప్రత్యేక చీర

Intro:ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్

Body:ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉదయగిరిలో పాఠశాలల బంద్ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి e కళాశాల వద్ద నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ మాజీ డివిజన్ కార్యదర్శి వెంకటయ్య మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యన భోజన పథకాన్ని కొనసాగించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ఖాళీగా ఉండే ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టుల భర్తీ చేయాలన్నారు. కరువు ప్రాంతం లోని విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల రాయితీలను కల్పించాలన్నారు. ప్రభుత్వం చెప్పిన విధంగా విద్యారంగంలో సమస్యలను పరిష్కరించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయం వద్ద సమస్యలపై నినాదాలు చేసి ఉప తాసిల్దార్ రవీంద్రకు వినతి పత్రం అందజేశారు.

Conclusion:ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.