కర్నూలు జిల్లా ఆలూరులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన మసాలా అరుణ అనే మహిళా రైతు ఆన్లైన్లో సర్వే నంబర్ తప్పుపడిందని, దానిని అడంగల్‌లో మార్పు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. పట్టా పాసుపుస్తకం ఇవ్వాలని అర్జీలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో వీఆర్వో కిష్టప్ప పాసుపుస్తకం కోసం రూ. పదిహేను వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా....రూ. పది వేలు ఇస్తానని అరుణ ఒప్పందం కుదుర్చుకుంది. లంచం ఇవ్వడానికి ఇష్టంలేని అరుణ కుమారుడు భరత్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కార్యాలయంలో వీఆర్వోకి డబ్బులు ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ జనార్ధన్ నాయుడు తెలిపారు.
ఇదీచూడండి. జాతీయ రహదారిపై కంది, శనగ రైతుల ఆందోళన