కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై ప్రభుత్వం స్పందించాలని సీపీఎం మాజీ ఎమ్మెల్యే ఎమ్.ఏ.గఫూర్ కోరారు. ఆటోలో చోరీ జరిగిందని పోలీసులు వేధించడం వల్లే అతను కుటుంబ సభ్యులతో కలిసి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపించారు. సలాం కుటుంబాన్ని వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పోలీసుల అడ్డగోలు ధోరణి, ముస్లింలకు జరుగుతున్న అన్యాయాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: గుడ్డు చిక్కింది.. పౌష్టికాహారం తగ్గింది!