కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ నాయకులు ఆందోళనకు దిగారు. అబ్దుల్ సలాం కుటుంబం బలవన్మరణానికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలని నంద్యాల శ్రీనివాసనగర్‌లో ధర్నా చేపట్టారు.
నిందితులకు బెయిల్ రావడం అన్యాయం..
సలాం ఘటనలో అరెస్టైన సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌కు బెయిల్ రావడం అన్యాయమని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు బెయిల్ రాదు.. అన్యాయం చేసిన పోలీసులకు మాత్రం బెయిల్ రావడాన్ని ఖండిస్తున్నామన్నారు.
కఠినంగా శిక్షించాలి..
ఆత్మహత్యకు కారకులైన నిందితులందరిని ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, తెదేపా యువ నేత ఎన్ఎండీ ఫిరోజ్, ముస్లిం ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : ఆరోగ్యశ్రీ వైద్య సేవల విస్తరణ ప్రారంభించిన సీఎం జగన్..