కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు చెందిన చక్రవర్తి.. అవుకు మండలం సుంకేసుల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి వద్దే ఉంటున్న ఆతను.. ఇవాళ స్నేహితులతో కలిసి సరదాగా కోవెలకుంట్ల సమీపంలోని కుందు నదికి వెళ్లాడు. నదిలో ఈత కొడుతూ చక్రవర్తి మునిగిపోయాడు. వెంట ఉన్న స్నేహితులు కాపాడాలని చూసినా ఫలితం లేకపోయింది. చక్రవర్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు మృతుని బంధువులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న కోవెలకుంట్ల ఎస్సై చంద్రశేఖర్.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి..