కర్నూలు జిల్లా నంద్యాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా కాన్వాయ్ ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. నంద్యాల నుంచి శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని వెలుగోడు పర్యటనకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆత్మకూరు మండలం కాకనూరు గ్రామానికి చెందిన వీరన్న అనే వృద్ధుడిని స్థానిక శ్రీనివాస సెంటర్ వద్ద కాన్వాయ్‌లోని ఓ వాహనం ఢీకొంది. గాయపడిన వీరన్నను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నంద్యాల ఆర్డీవో రామకృష్ణా రెడ్డి, డీఎస్పీ చిదానందరెడ్డి గాయపడిన వ్యక్తిని పరామర్శించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: రహదారి ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు