కన్నతల్లి కర్కశత్వం..పిలిస్తే పలకలేదని కూతురికి వాతలు కన్న కూతురునే కనికరం లేకుండా విచక్షణా రహితంగా వాతలు పెట్టిన కసాయి తల్లి బాగోతం కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని అవుకు మండలం మెట్టుపల్లికి చెందిన ప్రశాంతికి బిందు భార్గవి అనే 8 ఏళ్ల కుమార్తె ఉంది. వీధిలో ఆడుకుంటున్న కుమార్తె ఎంత పిలిచినా రాకపోవటంతో ఆగ్రహానికి గురైన తల్లి ఆ పాపకు చేతులపై వాతలు పెట్టింది. విషయం తెలుసుకున్న నానమ్మ లక్ష్మిదేవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గాయాలతో నరకం చూస్తున్న పాపను చూసి నాన్నమ్మ బోరున విలపిస్తున్నారు. బాధితురాలితో కలసి తల్లి మూడేళ్ల క్రితం వరకు కర్నూలులో ఉండేవారు. భర్త అనారోగ్యంతో చనిపోవటంతో ప్రస్తుతం మెట్టుపల్లిలో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చూడండి:
బతుకుతెరువు కోసం కువైట్ వెళ్లి..విగతజీవిగా వచ్చాడు!