MURDER IN NANDYAL: కర్నూలు జిల్లా నంద్యాలలో మహేశ్ గౌడ్(21) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలో సాయిబాబానగర్ నుంచి రైల్వేస్టేషన్ వెళ్లే రహదారిలో ఆటోలో వెళ్తున్న మహేశ్ గౌడ్ ను.. గుర్తు తెలియని వ్యక్తులు ఓ వాటర్ వాష్ వద్ద హత్య చేశారు. దుండగుల దాడిలో గాయపడ్డ సదరు యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
నంద్యాల పట్టణ శివారులోని శిల్పానగర్ కు చెందిన మహేశ్ గౌడ్ కు సొంత ఆటోలు ఉన్నాయి. రెండో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ రమణ, ఎస్సై మురళీ కృష్ణ లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: HEN LEAD TO FIGHT: కోడి తెచ్చిన తంట.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ