కర్నూలు జిల్లా నంద్యాల ఆర్డీవో ఎదుట సుధాకర్ అనే వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తోటి వారు గమనించి పెట్రోల్ డబ్బాను లాక్కున్నారు. మహానంది మండలం గాజులపల్లి ఆర్ఎస్కు చెందిన సుధాకర్, తిరుపతియ్యల మధ్య భూవివాదం ఉంది. ఈ విషయంలో పోలీసులు తిరుపతియ్య వైపు చెబుతూ తనకు అన్యాయం చేస్తున్నారని మాల మహానాడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ క్రమంలో సుధాకర్ పెట్రోల్ పోసుకున్నాడు. డబ్బాను లాగి అతనిని వారించారు.
ఇదీ చదవండి :