ETV Bharat / state

న్యాయం జరగడం లేదని 'స్పందన'లో రైతు ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Mar 2, 2020, 3:22 PM IST

తన పొలం ఇతరులు ఆక్రమించారంటూ అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగాడో రైతు. ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగడం లేదన్న మనస్తాపంతో 'స్పందన' కార్యక్రమంలో ఆత్మహత్యాయత్నం చేశాడు.

a farmer sucide attempt in spandana programme at kurnool
స్పందించకపోతే 'స్పందన'లోనే ఆత్మహత్య చేసుకుంటా!
న్యాయం జరగడం లేదని 'స్పందన'లో పెట్రోల్​ పోసుకుని రైతు ఆత్మహత్యాయత్నం

కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో ఓ రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పాములపాడు మండలం లింగాల గ్రామానికి చెందిన సుధాకర్ అనే రైతు తనకు చెందిన నాలుగెకరాల పొలాన్ని ఇతరులు ఆక్రమించారని అధికారులకు ఫిర్యాదు చేశాడు. కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా న్యాయం జరగలేదని సుధాకర్​ వాపోయాడు. సాక్ష్యాలున్నా ఎందుకిలా చేస్తున్నారంటూ 'స్పందన' కార్యక్రమంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు స్పందించి అతనిని స్టేషన్‌కు తరలించారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​:భార్య, పిల్లలకు విషమిచ్చి.. భర్త ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.