ETV Bharat / state

బ్యాలెట్ బాక్సులో తాగుబోతు వినతిపత్రం..!

ఓ తాగుబోతు.. వైన్​షాపుకెళ్లి తనకు కావాల్సిన బ్రాండ్​ అడిగినప్పుడు ఉంటే తీసుకుంటాడు. లేదంటే.. అమ్మేవాడు.. లేదని అంటాడు. అలా.. కోరుకున్న బ్రాండ్ లేనప్పుడు.. నాలుకకు అదే రుచి కావాలని అనిపించినప్పుడు.. ఆ తాగుబోతు ఎక్కడి నుంచైనా తెప్పించుకునేందుకు ప్రయత్నిస్తాడు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఓ తాగుబోతు.. ఇలాంటి ప్రయత్నాన్నే చేశాడు. ఏకంగా.. ముఖ్యమంత్రి జగన్​కే తన విజ్ఞప్తిని.. వినూత్నంగా.. ఇంకాస్త విచిత్రంగా.. చేసుకున్నాడు. అది కూడా.. మున్సిపల్ ఎన్నికలకు ఓటు వేసేందుకు వెళ్లి.. బ్యాలెట్ పేపర్​తో పాటు.. తాగుబోతుల తరఫున ఓ వినతిపత్రాన్ని బ్యాలెట్ బాక్సులో వేశాడు. తనకు కావాల్సిన బ్రాండ్లే అమ్మాలని.. లేకుంటే మళ్లీ ఓటేయనంటూ శపథం కూడా చేశాడు.

బ్యాలెట్ బాక్సులో తాగుబోతు వినతిపత్రం..!
బ్యాలెట్ బాక్సులో తాగుబోతు వినతిపత్రం..!
author img

By

Published : Mar 15, 2021, 8:48 AM IST

Updated : Mar 15, 2021, 9:20 AM IST

బ్యాలెట్ బాక్సులో తాగుబోతు వినతిపత్రం..!

మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లను లెక్కించిన.. అధికారులకు ఓ వింత విన్నపం కనిపించింది. ఓటు హక్కు వినియోగించుకున్న ఓ తాగుబోతు పాపం.. తన ఆవేదన వ్యక్తం చేశాడు. కొత్త బ్రాండ్ల స్థానంలో పాత బ్రాండ్లను అందుబాటులో తేవాలని.. తాగితే కిక్కెట్లేదన్నట్టు కోరాడు. అంతేనా.. లేకుంటే.. ఇవే చివరి ఎన్నికలు అవుతాయని ఓ రకం బెదిరింపులకు కూడా దిగాడు అనుకోండి. బ్యాలెట్ పత్రానికి ఓ తెల్ల కాగితంపై తమ అభిప్రాయాన్ని పొందుపరిచి పెట్టెలో 'నంద్యాల తాగుబోతుల విన్నపం' పేరుతో ఇలా వేశాడు. లెక్కింపు సమయంలో ఇది గమనించిన పొలింగ్ సిబ్బంది.. కాగితాన్ని పక్కన పెట్టారు. అది వైరల్ అయింది. కర్నూలు జిల్లా నంద్యాల 29వ వార్డు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎదురైన ఈ ఘటన.. తాగకపోయినా.. తలతిరిగిపోయేలా చేసింది.

కాగితంలో సారాంశం ఇదే..

నంద్యాల తాగుబోతుల విన్నపం

అయ్యా,

విషయం:- కర్నూల్( జిల్లా) నంద్యాల( మండలం), నంద్యాల పురపాలక సంఘం. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్​ జగనన్న గారికి తాగుబోతుల యొక్క విన్నపం. ఏమనగా కొత్త బ్రాండ్లు (సుప్రీం, దారు, హైదరాబాద్‌, జంబో తదితరాలు)ను తొలగించి ఓల్డ్ బ్రాండ్స్ (రాయల్‌ స్టాగ్‌, ఇంపీరియల్‌ బ్లూ, బ్లాక్‌ డాగ్‌) అమ్మాలని విన్నపం. లేకపోతే మా యొక్క చివరి ఓట్లు కాగలవని విన్నవించుకుంటున్నాము.

ఇవీ చదవండి:

యువకుడిపై గ్రామ వాలంటీర్​ భర్త కత్తితో దాడి.. పరిస్థితి విషమం

Last Updated : Mar 15, 2021, 9:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.