కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ళలో నామినేషన్ల పరిశీలన కేంద్రం వద్ద తెదేపా, వైకాపా వర్గాల మధ్య వివాదం నెలకొంది. వైకాపా అభ్యర్థుల నామినేషన్ సమయంలో కుల ధృవీకరణ పత్రం జత చేయకపోవడంతో తెదేపా నేతలు ప్రశ్నించారు. నామినేషన్‌లకు నిన్నే ఆఖరి రోజు అయినప్పటికీ.. ఇవాళ స్క్రూట్నీ పద్దతిలో కుల ధృవీకరణ పొందుపరచడానికి వచ్చిన వైకాపా అభ్యర్థులను.. తెదేపా నేతలు అడ్డుకున్నారు.
మూడు రోజుల్లో కుల ధృవీకరణ పత్రం సమర్పించవచ్చని రిటర్నింగ్ అధికారి చెప్పారని వైకాపా నేతలు చెబుతుండగా.., నామినేషన్ దాఖలు సమయంలోనే కుల ధృవీకరణ పత్రం సమర్పిచాలని తెదేపా నేతలు పేర్కొన్నారు. వైకాపా అభ్యర్థులు దాఖలు చేసిన 3 నామినేషన్‌లలో కుల ధృవీకరణ పత్రం లేని కారణంగా, వాటిని తిరస్కరించాలని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి...: వ్యయ పరిమితి దాటితే వేటే