ETV Bharat / state

గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

author img

By

Published : Mar 12, 2021, 1:19 PM IST

పెద్దపులి పాక గ్రామంలో ఈత కోసం నీటిలో దిగి గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇప్పటికే ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా.. మరో యువకుడి మృతదేహం లభించింది. మృతుడు రెహమాన్ ఖాన్, సనత్ నగర్ నివాసిగా పోలీసులు గుర్తించారు.

young men dead body identify
గల్లంతైన యువకుడు మృతదేహాలు లభ్యం

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పెద్దపులిపాక గ్రామంలో శివరాత్రి పర్వదినాన గల్లంతైన యువకులు మృతదేహాలు లభించాయి. నలుగురు యువకులు ఈత కొట్టేందుకు నీటిలో దిగగా.. వారిలో ముగ్గురు గల్లంతయ్యారు. ఒడ్డుకు వచ్చిన యువకుడు ఇచ్చిన సమాచారంతో.. పోలీసులు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు. వారిలో ఇద్దరు మృతదేహాలను ఇప్పటికే వెలికి తీసిన పోలీసులకు మరో మృతదేహం కూడా లభ్యమైంది. మృతుడు రెహమాన్ ఖాన్, సనత్ నగర్ నివాసిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఇలా జరిగేది కాదు..

పోలీసులు, స్థానిక పంచాయతీ అధికారులు అప్రమత్తమై ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని మృతుల బంధువులు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శివరాత్రి రోజు స్నానాలు చేసేందుకు నీటిలో దిగేవారి కోసం.. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవటం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి...

'వైకాపా రిగ్గింగ్​ను అడ్డుకున్నాం.. పోలీసుల విధులను కాదు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.