కృష్ణా జిల్లా నందిగామ మండలం మునగచర్లలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన గంటా నవీన్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నాలుగు రోజులుగా తన కుమారుడు కనిపించకపోవటంతో నవీన్ తల్లి నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టుల నేపథ్యంలోనే నవీన్ అదృశ్యమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో నందిగామ కాకతీయ స్కూల్ రోడ్డులో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు.