కృష్ణాజిల్లా అవనిగడ్డ శివారు ఎడ్లలంక గ్రామం పక్కన డంపింగ్ యార్డ్ కోసం తోటనరికి... అవనిగడ్డలోని చెత్తను తరలిస్తుంటే.. ఎడ్లలంక గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎడ్లలంక గ్రామం ఇప్పటి వరకు పచ్చదనం, పరిశుభ్రతతో ఉందన్నారు. పచ్చని పొలాల మధ్య వ్యవసాయ కూలీ పనులు ప్రశాంతంగా చేసుకుంటున్నామని.. చెత్తను తెచ్చి ఇక్కడ వేయడం మానుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అవనిగడ్డ మండల కేంద్రంలో 20 వేల జనాభా వినియోగించిన వ్యర్థాలను ఎడ్లలంక గ్రామం ప్రక్కన పోగుచేయడం గ్రామస్తుల ఆరోగ్యానికి, వ్యవసాయ పంటలకు, భూగర్భ జలాలకు, మత్స్య సంపదకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి నది గర్భంలో ఏర్పాటు చేయాలనుకున్న డంపింగ్ యార్డును వేరొక చోటికి తరలించి తమ ఆరోగ్యాన్ని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: 'అర్హత ఉన్నవారికి పథకాలివ్వకపోతే..పరిహారమివ్వాల్సిందే'