YCP MLA Vasantha Krishnaprasad Housing Board Case: సీఎం జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఇందూ-హౌసింగ్ బోర్డుకు చెందిన కేసు నుంచి తమను తప్పించాలంటూ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తోపాటు ఆయనకు చెందిన వసంత ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. నిందితులపై సీబీఐ చేసిన ఆరోపణలను ప్రాథమిక దశల్లో తోసిపుచ్చలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. కింది కోర్టులో విచారణకు ఎలాంటి సమాచారం లేదనీ చెప్పలేమన్నారు.
సీబీఐ అభియోగ పత్రంలోని అంశాలను పరిశీలించాక ఈ నిర్ణయానికి రాలేరని, విచారణలోనే తేలాలని పేర్కొన్నారు. ఎవిడెన్స్ చట్టంలోని సెక్షన్ ప్రకారం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది చేసిన కుట్రలో ఒకరి పాత్ర ఉన్నా విచారణ చేయవచ్చని, మిగిలిన వారి పాత్ర ఉందా లేదా అన్నది విచారణలో సమర్పించే సాక్ష్యాల ఆధారంగా తేలాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈమేరకు సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించారు.
కేసును కొట్టివేయాలన్న పిటిషనర్ల అభ్యర్థన మరీ ముందస్తు చర్య అవుతుందని, ఈ దశలో అలాంటి చర్య తీసుకోలేమన్నారు. సీఆర్‌పీసీ 482 కింద విచక్షణాధికారంతో ప్రత్యేక సందర్భాల్లోనే కేసును కొట్టివేస్తుందని, ఇక్కడ సీబీఐ ఆరోపణల నేపథ్యంలో ఈ కోర్టు కేసును కొట్టివేయడం లేదన్నారు. ఈ కేసులో సీబీఐ న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేసినట్లు కాదన్నారు. ఈ దశలోనే అభియోగ పత్రంలోని కేసును తేల్చలేమని, ఇది కింది కోర్టు విచారణలోనే తేలాలన్నారు.
ఇవీ చదవండి: