ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాలాభిషేకం చేశారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రమ్మీ, పోకల్ వంటి జూదం బెట్టింగ్‌లను నిషేధిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతించారు.
విజయవాడ గ్రామీణ మండల పరిషత్ కార్యాలయంలో.. సీఎం చిత్రపటానికి మండల పరిషత్ అధికారులు పాలాభిషేకం నిర్వహించారు. పంచాయతీ రాజ్శాఖలో కొందరికి ఆర్డీఓలుగా పదోన్నతి కల్పిస్తూ మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.
అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దివిసీమలో 3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో కృష్ణానదిపై 1350 కోట్ల రూపాయల వ్యయంతో బ్యారేజ్ నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపినందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పంచాయతీ రాజ్ శాఖలో పదోన్నతులను కల్పించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించడంపై శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి అధికారులు క్షీరాభిషేకం చేశారు.
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, శాసనసభ్యుడు సిద్ధారెడ్డి.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పదోన్నతుల నిర్ణయాన్ని స్వాగతించారు.
ఇదీ చూడండి:
ఐదేళ్ల కుమార్తెకు ఉరివేసి, తండ్రి ఆత్మహత్య... సెల్ఫీ వీడియో వైరల్