రూ. లక్షా30వేల కోట్లు విలువజేసే మాన్సాస్ ట్రస్ట్ భూములపై వైకాపా నేతల కన్ను పడిందని.. వాటిని కాజేసేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. తండ్రి ఆశయాలను బతికించుకోవటానికి మాజీ ఎంపీ అశోక గజపతిరాజు తపన పడుతున్నారని... ఆయనకు అందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో 105 దేవాలయాలతో పాటు, ఎన్నో విద్యాలయాలు ఉన్నాయని పేర్కొన్నారు. సంస్థకున్న పవిత్ర ఆశయాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంతో సహా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంస్థ విషయాల్లో జోక్యం చేసుకోలేదని గుర్తుచేశారు.
ఇదీచదవండి.