మచిలీపట్నంలో హత్యకు గురైన మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో.. పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఈ హత్య వెనక ఉన్న అసలు గుట్టును బయటపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పట్టుబడిన ఆ ముగ్గురి నుంచి కీలక సమాచారాన్ని సేకరించే దిశగా విచారణ చేస్తున్నారు.
మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుల్లో ఒకరైన మోకా భాస్కరరావు హత్య రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ఆరోపణలు, ప్రత్యారోపణలు అధికార విపక్షాల నుంచి జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో పట్టుబడిన ఆ ముగ్గురు.. పోలీసులకు ఏం చెప్పనున్నారు.. అసలు ఈ హత్యకు దారి తీసిన కారణాలేంటి అన్నది.. చర్చనీయాంశమైంది.
సంబంధిత కథనాలు:
వైకాపా నేత దారుణ హత్య.. నిందితుల కోసం పోలీసుల గాలింపు
మోకా భాస్కరరావు అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని