ETV Bharat / state

వైకాపా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది: నారా లోకేశ్ - నారా లోకేశ్ తాజా వార్తలు

కరోనాతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం మొద్ద నిద్రలో ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో కరోనాతో ఓ మహిళ మృతి చెందితే మృతదేహాన్ని కొన్ని గంటల పాటు వదిలేశారని దుయ్యబట్టారు.

nara lokesh
nara lokesh
author img

By

Published : Jul 27, 2020, 11:00 PM IST

కరోనాపై యుద్దానికి కావాల్సిన సన్నద్ధత కోసం లాక్ డౌన్ సమయాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకుంటే... జగన్‌ ప్రభుత్వం మాత్రం కక్ష సాధింపులో తీరికలేకుండా ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. దాని వల్లే ఆక్సిజన్ లేక ప్రజలు ప్రాణాలు వదలడం, రోడ్ల మీద చనిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు.

క్వారంటైన్ సెంటర్లలో సరైన వసతులు లేవంటూ ప్రజలు, పీపీఈ కిట్లు లేవంటూ వైద్య సిబ్బంది ఆందోళనకు దిగిన ఘటనలను లోకేశ్ గుర్తుచేశారు. ఇలాంటి సంఘటన గంటకొకటి వెలుగు చూస్తున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోవడం ఘోరమని మండిపడ్డారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో కరోనాతో ఓ మహిళ మృతి చెందితే ఆ మృతదేహాన్ని ఆస్పత్రి బెడ్ మీదే కొన్ని గంటల పాటు వదిలేశారని ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

ఇదీ చదవండి

దారుణం... చెత్త బండిలో కరోనా అనుమానితుడి తరలింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.