రాష్ట్రంలో చెడుదే రాజ్యంగా మారిందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. హత్యలు, అత్యాచారాలు, విధ్వంసాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు లేవని.. యువత ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయని యనమల అన్నారు. తొలి ఏడాది ఆర్థిక పరిస్థితి బాగున్నా.. అభివృద్ధి లేదని విమర్శించారు. రెండో ఏడాది కరోనా సాకుతో సీఎం జగన్ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
వైకాపా ప్రభుత్వానికి ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో తెలియదని.. కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడం చేతకాదని యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలలో మౌలిక వసతుల అభివృద్ది లేదని, ఒక్క సిమెంట్ రోడ్డు గానీ, ఒక్క కొత్త భవనం గానీ కట్టలేదని యనమల అసహనం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: రామకొలనులో రాముడి విగ్రహ శకలం లభ్యం