హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశాలు ఇవ్వటాన్ని మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు స్వాగతించారు. ఆర్టికల్ 243 కె(2) ప్రకారం భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్డినెన్స్ జారీ చేశారన్న ఆయన..., తాజా గవర్నర్ ఆదేశాలు జగన్ ప్రభుత్వానికి, అతని న్యాయ విభాగానికి గట్టి దెబ్బ అన్నారు. సీఎం జగన్ ఇకనైనా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని యనమల హితవుపలికారు.
ఇదీ చదవండి: ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించాలంటూ సీఎస్‌కు గవర్నర్ ఆదేశం