నిమ్మగడ్డ వ్యవహారంలో గవర్నర్ ఆదేశాలను వైకాపా ప్రభుత్వం పాటించాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. రమేష్ కుమార్ను ఎస్ఈసీగా పేర్కొంటూ.. తక్షణమే ఆదేశాలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారిగా రమేష్ కుమార్ను కొనసాగించాలన్న హైకోర్టు తీర్పుపై.. స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు యనమల పేర్కొన్నారు.
ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా.. వైకాపా గుణపాఠాలు నేర్చుకోవడం లేదని యనమల మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఇది ప్రజలు ఏర్పరుచుకున్న ప్రభుత్వంగా లేదని ఆరోపించారు. ప్రజాప్రభుత్వమైతే రాజ్యాంగాన్ని గౌరవిస్తుందన్నారు. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు పాలన చేస్తున్నట్లుగా లేదని... జగన్ కోసం, జగన్ చేత, జగన్ కొరకు పాలనలా ఉందని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: పోస్టులు పెట్టినవారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు: హైకోర్టు