ప్రభుత్వ కుట్రలతోనే కోడెల శివప్రసాదరావు చనిపోయారని,తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. నేరస్తులు చట్టం కింద వైకాపా నాయకులపై కుట్రదారులుగా కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చనిపోయాక కూడా కోడెల మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లనీకుండా చేయడం, దేశంలో ఎక్కడా జరగలేదని వాపోయారు. మంత్రి బొత్స వ్యాఖ్యలను బట్టి చూస్తే, దీన్ని హత్య కేసుగానే చూడాల్సి వస్తుందని యనమల అన్నారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం కోడెలది ఆత్మహత్యే అని తేలడంతో, ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏమంటారని ఆయన ప్రశ్నించారు. తక్షణమే నరసరావుపేటలో నిషేధాజ్ఞలు తొలగించాలని డిమాండ్ చేశారు. .
ఇదీ చూడండినేడు గుంటూరుకు కోడెల పార్థివదేహం...రేపు అంత్యక్రియలు..!