సీఎం కాన్వాయ్ అడ్డుకునేందుకు మహిళల యత్నం - women tries to stop cm convoy news updates
విజయవాడ నుంచి ముఖ్యమంత్రి కాన్వాయ్ బయలుదేరే సమయంలో... వాహనాలకు అడ్డుకోవటానికి మందడంలోని మహిళలు ప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రి వెళ్లే సమయంలో పోలీసులు వారిని ఇళ్లనుంచి బయటకు రానివ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల ముందు కంచెలు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విచారణ వ్యక్తం చేశారు. అనంతరం మహిళలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.