ఆపదలో ఉన్న గర్భిణికి... కృష్ణా జిల్లా మచిలీపట్నం దిశ మహిళ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నాగ సరస్వతి(స్వాతీ) రక్తదానం చేసి ఆదుకున్నారు.
అవనిగడ్డకు చెందిన వెంకటలక్ష్మి అనే గర్భిణికి బి-పాజిటివ్ రక్తం అవసరం కాగా... సామాజిక మాధ్యమాల్లో చూసి హెడ్ కానిస్టేబుల్ నాగ సరస్వతి స్పందించింది. ఈ విషయం తెలుసుకున్న డీజీపీ గౌతమ్ సవాంగ్... స్వాతీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి అభినందించారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు స్వాతిని సన్మానించి, రివార్డును అందజేశారు.
ఇదీ చదవండి: రక్తం దానం చేసి మానవత్వం చాటుకున్న మహిళా కానిస్టేబుల్