కృష్ణాజిల్లా నందిగామ శివారులోని అనాసాగరంలో జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని స్థానిక మహిళలు ఆందోళన చేపట్టారు. దుకాణానికి తాళాలు వేసి మద్యం విక్రయాలను అడ్డుకున్నారు. రహదారి పక్కనే ఏర్పాటు చేయటం వల్ల మందుబాబులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రివేళల్లో అటుగా వెళ్లాలంటేనే భయపడుతున్నామని వాపోయారు. మద్యం దుకాణాన్ని తొలగించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వెంటనే ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: