కృష్ణా జిల్లా మైలవరం మండలం పుల్లూరులో దారుణం జరిగింది. విజయలక్ష్మి అనే మహిళను ఆమె ప్రియుడు గడ్డపారతో కొట్టి హతమార్చాడు. తన భర్త రెండో వివాహం చేసుకున్నందున విజయలక్ష్మి అతని నుంచి వేరుపడి... గాలంకి రాజేష(25) అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. ఇద్దరూ చండ్రగూడెంలోనే నివాసముంటున్నారు. గత కొద్ది రోజులుగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడం వల్ల ఇరువురు ఘర్షణ పడేవారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన గొడవలో రాజేష్ ఆవేశంలో విజయలక్ష్మిని గడ్డపారతో తలపై బలంగా కొట్టాడు. ఈ ఘటనలో విజయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: