కృష్ణా జిల్లా నూజివీడులోని ఓ మద్యం దుకాణం వద్ద దళిత యువకులపై మద్యం బాటిల్‌తో దాడి చేసిన ఘటన తీవ్ర సంచలనం కలిగిస్తోంది. నూజివీడు పట్టణం మైలవరం రోడ్డులోని పున్నమి వైన్స్‌కు మద్యం కొనుగోలు నిమిత్తం దళిత యువకులు వచ్చారు. అప్పుడే అక్కడకు చేరుకున్న స్థానిక స్టేషన్ తోటకు చెందిన కొందరు యువకులు... వారిని కులం పేరుతో దూషిస్తూ... మద్యం బాటిళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
సమీపంలోని ప్రజలు బాధితులను నూజివీడు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వారిని మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మీద పోలీసులు స్పందించడం లేదంటూ.. నిరసన వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి:
రౌడీషీటర్ల ఆధిపత్య పోరు.. హత్యాయత్నాన్ని భగ్నం చేసిన పోలీసులు