కృష్ణా జిల్లాలోని ఓ పోలీసు స్టేషన్లో భర్తపై భార్య ఫిర్యాదు చేసింది. ఇంతకీ కారణం ఏంటీ అనుకుంటున్నారా? టిక్‌టాక్‌లో చేసిన వీడియోనే.
కృష్ణాజిల్లాకు చెందిన సత్యరాజు అనే వ్యక్తి 2009లో వివాహం చేసుకున్నాడు. పిల్లలు పుట్టడం లేదని భార్యను మానసికంగా.. శారీరకంగా హింసించడం మెుదలుపెట్టాడు. ఈ క్రమంలోనే టిక్‌టాక్‌లో పరిచయమైన హైదరాబాద్‌కు చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం మొదటి భార్యకు చాలా రోజుల వరకు తెలియలేదు. ఓ రోజు సత్యరాజు తన రెండో భార్యతో కలిసి వీడియో చేసి.. టిక్‌టాక్‌లో పోస్టు చేశాడు. అది మెుదటి భార్య కంటపడింది. విషయం తెలిసిన వెంటనే ... భర్తను నిలదీసింది. కొన్ని రోజులు వచ్చి ఉన్నా.. మళ్లీ కథ మెుదటికే వచ్చింది. చేసేదేమీ లేక పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
ఇదీ చదవండి: ఇప్పటికింకా.. ఈ బామ్మ వయసు నిండా పదహారే!